2022 ఏడాదికి గాను 70వ జాతీయ సినీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కార్తికేయ-2 సినిమా ఉత్తమ తెలుగు సినిమా అవార్డును దక్కించుకుంది.
ఉత్తమ నటి అవార్డు ఈసారి ఇద్దరు నటీమణులకు వచ్చింది. తమిళ చిత్రం తిరుచిట్రంబళంలో నటించిన నిత్య మేనన్‌కు, గుజరాతీ సినిమా కచ్ ఎక్స్‌ప్రెస్‌లో నటించిన మానసి పరేఖ్‌కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి తను నటించిన కాంతారా సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డును పొందారు.
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఉత్తమ తమిళ సినిమా అవార్డును పొందగా..
కన్నడలో ఉత్తమ చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది.
మనోజ్ బాజ్‌పేయి, షర్మిల ఠాగూర్ నటించిన గుల్మోహర్ ఉత్తమ హిందీ చిత్రం అవార్డును దక్కించుకుంది.
బ్రహ్మాస్త్ర పార్ట్ 1 కంపోజర్ ప్రీతమ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు గానూ ఏఆర్ రెహ్మాన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును పొందారు.
బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాలో కేసరియా పాటకు అర్జిత్ సింగ్ ఉత్తమ మేల్ సింగర్
అవార్డును దక్కించుకున్నారు.
హిందీ చిత్రం ఉంచాయికి దర్శకత్వం వహించిన సూరజ్ బర్జాత్యాకు ఉత్తమ దర్శకుడి అవార్డు వచ్చింది.
మలయాళం సినిమా ఆట్టమ్ ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును దక్కించుకుంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
నగదు బహుమతి ఎంత?
ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైన ఆట్టమ్కు స్వర్ణ కమలంతోపాటు పాటు, నిర్మాత జాయ్ మూవీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ, దర్శకుడు ఆనంద్ ఎకర్షికి తలో 3 లక్షల రూపాయలు బహుమతిగా అందిస్తారు.
ఉత్తమ నటి కేటగిరీలో నిత్యా మేనన్‌కు, మానసి పరేఖ్‌కు రజత కమలంతో పాటు ఇద్దరూ పంచుకునేలా 2 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించారు.
ఉత్తమ నటుడు అవార్డును పొందిన రిషబ్ శెట్టికి రజత కమలంతో పాటు 2 లక్షల రూపాయల బహుమతి అందిస్తారు.
ఉత్తమ డైరక్టర్ అవార్డును పొందిన సూరజ్ బర్జాత్యాకు స్వర్ణకమలం అవార్డుతో పాటు 3 లక్షల రూపాయల బహుమతి లభిస్తుంది.
కాంతార మూవీ రివ్యూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
కేజీఎఫ్ 2 రివ్యూ: చాప్టర్ 2లో అసలు కథ ఎంత? యష్, ప్రశాంత్ నీల్ విజయం సాధించారా?
కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?
ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2కు రజత కమలం అవార్డుతో పాటు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతోపాటు, డైరెక్టర్ చందూ మొండేటికు తలో 2 లక్షల బహుమతి లభిస్తుంది.
ఉత్తమ తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1కు రజత కమలంతో పాటు నిర్మాత మద్రాస్ టాకీస్, డైరెక్టర్ మణిరత్నంకు చెరో 2 లక్షలు అందిస్తారు.
ఇక కన్నడలో ఉత్తమ చిత్రంగా నిలిచిన కేజీఎఫ్ చాప్టర్ 2కు కూడా రజత కమలం అవార్డుతో పాటు డైరెక్టర్ హోంబలే ఫిల్మ్స్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు చెరో రూ.2 లక్షల బహుమతి లభిస్తుంది.
ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైన గుల్మోహర్కు రజత కమలంతో పాటు నిర్మాత స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దర్శకుడు రాహుల్ వీ చిట్టెలాకు చెరో రూ.2 లక్షలు బహుమతిని అందిస్తారు.
పోస్ట్ Twitter స్కిప్ చేయండి
Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Twitter ముగిసింది
కార్తికేయ 2:
హిందూ పురాణాలు తిరగేస్తే ఎన్నో పాత్రలు. లెక్కలేనన్ని ఆశ్చర్యాలు కనిపిస్తాయి. వాటి చుట్టూ ఎన్నో ప్రశ్నలు, కథలు. అవి సినిమాలకూ ఉపయోగపడతాయి. చాలామంది దర్శకులు ఇతిహాసాల్లోని పాయింట్లతో సినిమాలు తీసి మెప్పించారు.
కార్తికేయ 2 కూడా అలాంటి కథే. ద్వారక అనే మహా నగరం నీటిలో మునిగిపోయిందని హిందూ పురాణాలు చెప్పాయి. శాస్త్రవేత్తలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది నిజమే అంటారు. మునిగిన ద్వారకలో ఎన్నో మర్మాలు దాగున్నాయి.
ద్వారక చుట్టూ ఎన్నో ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. అందులో ఓ ప్రశ్న... శ్రీకృష్ణుడి కాలి కడియం. కలియుగంలో ఈ సృష్టి నాశనమైపోతుందని, దానికి విరుగుడు శ్రీకృష్ణుడి కాలి కడియంలో ఉందని నమ్మితే.. దాని కోసం హీరో రంగంలోకి దిగితే, ఎలా ఉంటుందన్నదే ఈ కథ.
పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మాయాజాలం ఫలించిందా?
పొన్నియిన్ సెల్వన్: 70 ఏళ్ల కిందట మ్యాగజీన్లో సీరియల్.. ఇప్పుడు వెండితెరపై మల్టీస్టారర్
కమిటీ కుర్రోళ్ళు రివ్యూ : ఈ కోనసీమ కథ ఆకట్టుకుందా
కేజీఎఫ్ 2 సినిమా:
బాక్సాఫీసును షేక్ చేసి, బాలీవుడ్‌కే బీటలు వాలేలా చేసిన సినిమా కేజీఎఫ్. దీనికి రెండో పార్ట్‌గా కేజీఎఫ్ 2ను రెడీ చేసి విడుదల చేశారు ప్రశాంత్ నీల్.
ముంబై నగరంలోని ఓ మామూలు కుర్రాడు.. బంగారు గనుల సామ్రాజ్యం నరాచీని ఎలా కైవసం చేసుకున్నాడన్నది కేజీఎఫ్ 1లో చూశాం.
సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తరవాత.. ఏం జరిగిందో... చాప్టర్ 2లో చూపించారు దర్శకుడు.
తంగలాన్ మూవీ రివ్యూ: బంగారంతో బానిసత్వం పోయిందా, విక్రమ్ ఖాతాలో హిట్ పడిందా?
డబుల్ ఇస్మార్ట్ రివ్యూ: పూరి మరోసారి తన మార్కు చూపాడా, ప్రేక్షకులకు డబుల్ ధమాకా దొరికిందా?
ఎ జర్నీ టు కాశీ: జీవితపు లోతులను తడిమే అద్వైతం
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1:
మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా 'పొన్నియిన్ సెల్వన్' తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 కూడా విడుదలైంది.
పొన్నియిన్ సెల్వన్ అనేది ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు. తన మ్యాగజీన్ 'కల్కి' కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు.
చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. పరాంతక చోళునికే సుందర చోళ అనే మరో పేరు కూడా ఉంది.
కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి.
ప్రముఖ చరిత్రకారులు కె.ఎ. నీలకంఠ శాస్త్రి రాసిన 'ది చోళాస్' పుస్తకం, టి.వి. సదాశివ బండారుతార్ రచించిన 'హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్', ఆర్. గోపాలన్ రాసిన 'పల్లవాస్ ఆఫ్ కంచి' అనే పుస్తకాల ఆధారంగా కల్కి ఈ నవలను రాశారు.
ఈ నవల కోసం చోళులు పాలించిన అనేక ప్రాంతాల్లో కల్కి పర్యటించారు. తంజావూరు, నాగపట్టణం, తిరువారూర్, అరియలూరుతో పాటు శ్రీలంకలో కూడా పర్యటించారు.
ఆయన వెంట మణియన్ అనే చిత్రకారుడు కూడా వెళ్లారు. కల్కి మ్యాగజీన్లో పొన్నియన్ సెల్వన్ నవలలో ప్రచురించిన చిత్రాలన్నీ మణియన్ గీశారు. ఈ నవల 2,400 పేజీలు ఉంటుంది. దీన్ని 5 భాగాలుగా రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,ట్విటర్లో ఫాలో అవ్వండి.యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)